Showing posts with label nirbhaya. Show all posts
Showing posts with label nirbhaya. Show all posts

Friday, September 13, 2013

నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష


Delhi Gang Rape
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు దోషులకు సాకేత్ కోర్టు ఉరి శిక్ష విధించింది. శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ కేసులో దోషులకు కోర్టు శిక్ష ఖరారు చేస్తూ కోర్టు తీర్పును వెలవడించింది. వైద్య విద్యార్థినిపై అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడిన వినయ్‌శర్మ, ముఖేష్‌సింగ్, అక్షయ్ కుమార్, పవన్‌గుప్తాలకు ఉరేసరి అని కోర్టు నిర్ధారించింది. ఈ కేసుపై వంద సార్లు విచారణలు విచారణ జరిగింది.

2010 డిసెంబర్ 16న ఢిల్లీలో నడుస్తున్న బస్సులో వైద్య విద్యార్థిని నిర్భయపై ఆరుగురు కామాంధులు అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈకేసులో ప్రధాన నిందితుడు రామ్‌సింగ్ తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మైనరిటీ తీరని మరో నిందితుడికి జువైనల్‌కోర్టు మూడేళ్ల జైలుశిక్ష విధించింది.

For More Today's Latest News please visit Andhra Jyothy Newspaper