Showing posts with label empolyees. Show all posts
Showing posts with label empolyees. Show all posts

Monday, August 26, 2013

Bhagyana'Garam'!

Bhagyanagaram
రాజధానిలో 'ప్రత్యేక' ఉద్రిక్తతలు రాజుకుంటున్న మాటల మంటలు సమైక్య, తెలంగాణవాదుల పోటాపోటీ నిరసనలు ఉద్యోగుల నినాదాలతో వేడెక్కుతున్న కార్యాలయాలు ఆజ్యం పోస్తున్న రాజకీయ నాయకులు సవాల్‌గా మారిన శాంతిభద్రతల నిర్వహణ భద్రత కోరుతున్న వీఐపీలు 'సెప్టెంబర్ 7'పై హైటెన్షన్ సభ జరిపి తీరతామంటున్న ఏపీఎన్జీవోలు అదీ చూస్తామంటున్న తెలంగాణ వాదులు  సమైక్య ఉద్యమంతో సీమాంధ్ర జిల్లాలు... విభజన కోసం ర్యాలీలు, ప్రదర్శనలతో తెలంగాణ ప్రాంతం!

అటు సమైక్యం, ఇటు విభజనవాదం రెండు ఉద్యమాలతో నివురుగప్పిన నిప్పులా మారిన భాగ్యనగరం! 'పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తున్నాం' అంటూ సీడబ్ల్యూసీ ప్రకటన వెలువడిన మరుసటి రోజు నుంచి సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళనతో హైదరాబాద్‌లో పరిస్థితి వేడెక్కడం మొదలైంది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యోగులు కూడా రంగంలోకి దిగారు. నిజానికి... చాలా కార్యాలయాల్లో తొలుత ఒక ప్రాంతం వారు, ఆ తర్వాత మరొక ప్రాంతం వారు నినాదాలు, నిరసనలు నిర్వహించుకుంటున్నారు. దీని వల్ల ఎలాంటి సమస్య ఉండటంలేదు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

About Andhra Jyothy : The New Age demands a new newspaper! Where every alphabet will have to be an arsenal in itself!! A newspaper wakes you up. A vibrant newspaper shakes your conscience. The need of the hour is beyond this simplification. Hence, the re-launching of, in a way the rebirth of, Andhra Jyothi.

Thursday, August 22, 2013

Ruin The Party!

Ruin The Party!
భరోసా లేకుండా విభజన అంటే ఎలా?సీమాంధ్రలో కాంగ్రెస్‌ను మరిచిపోవాల్సిందే అప్పుడు నేను పార్టీలో ఉన్నా ఒకటే,లేకున్నా ఒకటేసోనియా,రాహుల్‌లతో కిరణ్ విభజనతో కొత్త సమస్యలు తలెత్తుతాయి
కేసీఆర్, కేటీఆర్ వ్యాఖ్యలతో పరిస్థితి తీవ్రం జలాల పంపిణీ అంత సులభం కాదు హైదరాబాద్ లాంటి రాజధాని ఎలా సాధ్యం? ఆ స్థాయి సదుపాయాలకు ఎన్ని లక్షల కోట్లు కావాలి? నిపుణులతో కమిటీ వేసి ఆందోళనలు తొలగించాలి నిర్ణయం తీసుకున్నాం.. నిర్దిష్ట ప్రతిపాదనలివ్వండి సోనియా, రాహుల్ సూచన వచ్చే వారం మళ్లీ ఢిల్లీకి ముఖ్యమంత్రి.

రాష్ట్ర విభజన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, లేకపోయినా ఒకటే!ఎందుకంటే సీమాంధ్రలో పార్టీ అస్తిత్వమే ఉండదు.లక్షలాదిగా ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు దిగారు.పరిస్థితి భయానకంగా మారింది. ప్రజలకు నచ్చజెప్పే పరిస్థితి ఎప్పుడో దాటిపోయింది.ఈ పరిస్థితుల్లో విభజనపై ముందుకు వెళితే సీమాంధ్రలో కాంగ్రెస్‌కు పుట్టగతులు ఉండవు. కనీసం 50 లక్షల మంది కార్యకర్తల భవిష్యత్తు అంధకార బంధురమై పోతుంది. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీని బతికించిన వారు ఎక్కడికి వెళ్లాలి?

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

About Andhra Jyothy : The New Age demands a new newspaper! Where every alphabet will have to be an arsenal in itself!! A newspaper wakes you up. A vibrant newspaper shakes your conscience. The need of the hour is beyond this simplification. Hence, the re-launching of, in a way the rebirth of, Andhra Jyothi.

Wednesday, August 14, 2013

Frozen Simandhra

Frozen Simandhra
సమ్మె శంఖం మోగింది. సీమాంధ్రలో పాలన స్తంభించింది. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన సమ్మె తొలిరోజునే తీవ్రస్థాయిలో సాగింది. సుమారు 4 లక్షల మంది విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని శాఖాధిపతుల కార్యాలయాలు, సీమాంధ్రలోని 13 జిల్లాల్లోని అన్ని శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు సంపూర్ణంగా సమ్మెలో పాల్గొన్నారు. సీమాంధ్రలోని 102 మునిసిపాలిటీలు, 12 కార్పొరేషన్ల పరిధిలోని ఉద్యోగులంతా సమ్మెకు దిగారు. అత్యవసర సేవలు మినహా... అన్ని విధులు బహిష్కరించారు.

సీమాంధ్ర జిల్లాల్లో దాదాపు 90 శాతం మంది ఉద్యోగులు తొలిరోజు సమ్మెలో పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కలెక్టరేట్‌తో సహా ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగులంతా సమ్మెలో పాల్గొన్నారు.

Read More Andhra Jyothy ePaper