ఓట్ల కోసం కాంగ్రెస్, టీడీపీలే కుమ్మక్కు లౌకిక పార్టీలకే మా మద్దతు హిందూత్వ ముసుగు తొలగిచుకుంటే మోదీతో పొత్తుకు ఆలోచిస్తాం: వైఎస్ జగన్ గవర్నర్‌తో భేటీ, వెంటనే అసెంబ్లీ సమావేశానికి వినతి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో అక్టోబర్ 15, 20 తేదీల మధ్య హైదరాబాద్‌లో సమైక్య శంఖారావం పేరిట భారీ సభ నిర్వహిస్తామని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తెలిపారు. తాను ఎక్కడకీ వెళ్లకుండా కట్టడి చేస్తున్నా ప్రజల హృదయాల్లోనుంచి మాత్రం తీసేయలేరని వ్యాఖ్యానించారు.
సమైక్యం కోరే పార్టీలు తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. టీడీపీసహా విభజనకు సహకరించిన పార్టీలను ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం ఆయనిక్కడ మీడియాతో మాట్లాడారు.
For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

No comments:
Post a Comment