Wednesday, August 14, 2013

Frozen Simandhra

Frozen Simandhra
సమ్మె శంఖం మోగింది. సీమాంధ్రలో పాలన స్తంభించింది. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన సమ్మె తొలిరోజునే తీవ్రస్థాయిలో సాగింది. సుమారు 4 లక్షల మంది విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని శాఖాధిపతుల కార్యాలయాలు, సీమాంధ్రలోని 13 జిల్లాల్లోని అన్ని శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు సంపూర్ణంగా సమ్మెలో పాల్గొన్నారు. సీమాంధ్రలోని 102 మునిసిపాలిటీలు, 12 కార్పొరేషన్ల పరిధిలోని ఉద్యోగులంతా సమ్మెకు దిగారు. అత్యవసర సేవలు మినహా... అన్ని విధులు బహిష్కరించారు.

సీమాంధ్ర జిల్లాల్లో దాదాపు 90 శాతం మంది ఉద్యోగులు తొలిరోజు సమ్మెలో పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కలెక్టరేట్‌తో సహా ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగులంతా సమ్మెలో పాల్గొన్నారు.

Read More Andhra Jyothy ePaper

About Andhra Jyothy : The New Age demands a new newspaper! Where every alphabet will have to be an arsenal in itself!! A newspaper wakes you up. A vibrant newspaper shakes your conscience. The need of the hour is beyond this simplification. Hence, the re-launching of, in a way the rebirth of, Andhra Jyothi.

No comments:

Post a Comment