Wednesday, September 4, 2013

Release Struggles!


Release Struggles!
కన్నీళ్లు పెడుతున్న రీళ్లు తెలుగు సినిమాకు ఉద్యమాల దెబ్బ విడుదల జాప్యంతో బొమ్మపడక నిర్మాతలు బెంబేలు డిస్ట్రిబ్యూటర్లలో కలవరం దిక్కులు చూస్తున్న థియేటర్లు సీమాంధ్రలో రోజుకు రెండాటలే 'తుఫాను' విడుదలపై టెన్షన్ ఆటాడించే సినిమా ఎవరి ఆటలోనో అరటిపండు అవుతోంది. వినోదాన్ని పంచే శక్తిమంతమైన మాధ్యమం అతికష్టంగా శక్తిని కూడగట్టుకునేందు కు నష్టకష్టాలు పడుతోంది. రంగుల ప్రపంచంలో మనల్ని ఓలలాడించిన తెలుగు చిత్ర జగత్తు, ఇప్పుడు రీళ్లు తెగి 'ద్విశంకు స్వర్గం'లో ఉక్కిరిబిక్కిరవుతోంది.

రాష్ట్రాన్ని చుట్టుముట్టిన 'విభజన' సెగల్లో తెలుగు ఫిల్ములు తగలబడుతున్నాయి. లొకేషన్ల నుంచి థియేటర్ల దాకా ఉద్యమాల కన్నెర్రకు గురవుతుండగా భారీ, చిన్న తేడా లేకుండా విడుదలకు వణుకుతున్నాయి. పెట్టుబడిని చిక్కబట్టుకునే దిశగా 'మళ్లీ బొమ్మ పడకపోతుందా?' అన్న ఆశతో నిర్మాతలు ఎదురుచూస్తున్నారు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

About Andhra Jyothy : The New Age demands a new newspaper! Where every alphabet will have to be an arsenal in itself!! A newspaper wakes you up. A vibrant newspaper shakes your conscience. The need of the hour is beyond this simplification. Hence, the re-launching of, in a way the rebirth of, Andhra Jyothi.

No comments:

Post a Comment